కరోనా : టాప్ ప్లేస్ లోకి చేరిన భారత్.. అమెరికాను వెనక్కి నెట్టి మరీ.?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్లాక్ మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభం అవుతున్న క్రమంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నప్పటికీ... రికవరీ రేటు కూడా అంతే రికార్డు స్థాయిలో ఉండడంతో ప్రస్తుతం అందరిలో కాస్త ధైర్యం నిండిపోతుంది. ఇక రోజురోజుకు దేశంలో రికవరీ రేటు పెరుగుతూనే ఉంది.
ఇక ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్వన్ స్థానానికి చేరింది భారత్. ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న భారత్.. రికవరీ రేటు లో మాత్రం ప్రపంచంలోని అగ్ర స్థానానికి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ నుంచి కోల్పోయిన వారి సంఖ్య 42,08,431 గా ఉంది. భారత్ తర్వాత అమెరికా బ్రెజిల్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 79.28 రికవరీ రేటు ఉంది అన్న విషయాన్ని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. రాష్ట్రాలవారీగా రికవరీ రేటులో బెంగాల్ తమిళనాడు బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తొలి నాలుగు స్థానాల్లో ఉండటం గమనార్హం.