రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. ఉచితంగా..?

praveen
రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ చేయూతనిస్తూ వ్యవసాయాభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ఇప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ మరింత ప్రోత్సాహం అందించే విధంగా వివిధ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది రైతులకు ఉచితంగా ప్రభుత్వం తరఫున బోర్లు వేయించి... వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇటీవలే వైయస్సార్ జల కళ అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇక ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మరో తీపి కబురు చెప్పింది.



 ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ఉచితంగా ప్రభుత్వం తరఫున భీమా అమలు చేసేందుకు నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ పంట బీమా ను పొందేందుకు రైతులందరూ ఈ-పంటలో  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న పంటలకు మాత్రమే ఉచిత బీమా ను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ఇప్పటికే 101 కోట్ల వాటా ధనంతో ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.



 అయితే కొన్ని నిబంధనలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో... గత ఏడాది పలు పంటలకు బీమా అందించిన విషయం తెలిసిందే. అయితే ఏ పంటలకు ఎలాంటి బీమా వర్తిస్తుంది అనే వివరాలను కూడా వెల్లడించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. జనరల్ క్రాఫ్ట్ ఎస్టిమేషన్ సర్వే ఆధ్వర్యంలో నిర్వహించే నిర్దేశిత పంటకోత ప్రయోగాల కోసం దిగుబడి ఆధారిత పంటల బీమా క్లయిమ్ పరిష్కరించనున్నారు. కాగా ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం రైతులందరికీ ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి. వాతావరణం అనుకూలించక లేదా ఇతర కారణాల వల్ల పంట నాశనం అయిన సమయంలో  బీమా రావడంతో రైతులకు చేయూత వచ్చినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: