99 ఏళ్ల బామ్మకు కరోనా.. ఆసుపత్రిలో 100వ పుట్టినరోజు.. చివరికి..?

praveen
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రస్తుతం అన్లాక్ మార్గదర్శకాలు కొనసాగుతూ ప్రజలందరూ బయట తిరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగి పోతూనేనే ఉంది. ప్రజలు కూడా ఈ కరోనా వైరస్ తో సహజీవనానికి అలవాటు పడిపోయి తగు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా రికార్డు స్థాయిలో ఉండడం అందరిలో మరింత ధైర్యాన్ని పెంచుతుంది.

 వృద్ధులకు కరోనా  వైరస్ ద్వారా ఎంతో ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ ప్రస్తుతం భారతదేశంలో వృద్ధులు సైతం క్రమక్రమంగా కరోనా ను  జయిస్తూ ఉండటం ధైర్యం నింపుతుంది అనే చెప్పాలి. మధుమేహం హైపర్టెన్షన్ తో పాటు కరోనా  వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన 99 ఏళ్ల బామ్మను  65 ఏళ్ల ఆమె కుమారుడు   కూడా కరోనా  వైరస్ ను జయించారు. అంతేకాదు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆమె 100వ  పుట్టినరోజును జరుపుకోవడం గమనార్హం. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సదరు వృద్ధురాలు... కేవలం 15 రోజుల వ్యవధిలోనే కోలుకోవడం గమనార్హం.

 సదరు వృద్ధురాలి తో పాటు ఆమె కొడుకు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆక్సిజన్ అందించారు. యాంటీ వైరస్,  స్టెరాయిడ్స్ ఇవ్వడం తో పాటు ప్లాస్మా తెరఫీ  కూడా అందించారు. ఇక ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే వారు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా  వైరస్ ను జయించగల అన్న ఆమె ఆత్మ విశ్వాసమే ఆమెను బతికించింది వైద్యులు  హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇలా ఏకంగా 99 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ నుంచి కోలుకోవడం... కరోనా  వైరస్ బారినపడి మనస్తాపం చెందుతున్న ఎంతోమందిలో ధైర్యం నింపింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: