మొన్న ప్రయోగం.. నేడు మోహరింపు.. మోడీ ప్లాన్ అదిరింది..?

praveen
భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఓవైపు భారత్-చైనా తో చర్చలు జరుపుతూనే మరోవైపు భారీగా మోహరింపులు  కూడా చేపడుతుంది. ప్రస్తుతం చైనా కు దీటుగా సరిహద్దుల్లో బదులిచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఓ  వైపు భారీగా సైనికుల ను మోహరించడం తో పాటు యుద్ధ విమానాల ను యుద్ధ ట్యాంకుల ను కూడా సరిహద్దుల్లో భారీగా మోహరిస్తున్నది  భారత్. అంతేకాదు అత్యాధునిక ఆయుధాల ను కూడా సరిహద్దులో మోహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయుధ వ్యాపారాన్ని ప్రారంభించిన భారత్.. ఇన్ని రోజుల వరకు ప్రయోగ దశలో ఉన్న ఎన్నో ఆయుధాలను ప్రస్తుతం పరీక్షించి అటు వెంటనే భారత అమ్ములపొదిలో కి చేరుస్తుంది భారత్.



 ఇటీవలే భారత్లో తయారు చేసిన కొన్ని స్వదేశీ ఆయుధాలు విజయవంతమైన విషయం తెలిసిందే. సరికొత్త టెక్నాలజీ తో డి ఆర్ డి ఓ తయారు చేసిన ఆయుధాలు ప్రస్తుతం భారత అమ్ములపొది లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమం లోనే ఆయుధాల ప్రయోగాలు చేయడం తో పాటు శరవేగంగా భారత ఆర్మీ లోకి ఆయుధాలను చేరుస్తుంది భారత్. ఇటీవలే పరీక్షల్లో విజయవంతం అయిన.. సౌర్య మిస్సైల్ ను సరిహద్దుల్లో మొహరిస్తున్నట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే వరుసగా సరికొత్త ప్రయోగాలు నిర్వహించడం తో పాటు ఈ ప్రయోగాల్లో విజయవంతం అవుతున్న సరికొత్త టెక్నాలజీతో కూడిన ఆయుధాలు  నిర్భయ్,  సౌర్య,  స్మార్ట్ ఇలాంటి ఆయుధాల ను సరిహద్దుల్లో  మోహరిస్తోంది భారత ప్రభుత్వం. అయితే ప్రస్తుత సరిహద్దుల వెనక్కి తగ్గినట్టు నాటకం ఆడుతున్న చైనా ఏ క్షణంలోనైనా భారత్పై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో... ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన మిస్సైల్స్  మోహరిస్తున్నట్లు  తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఆత్మ రక్షణ కోసమే అన్న  సమాచారాన్ని ప్రపంచ దేశాలకు అందిస్తూనే ఉంది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: