నేపాల్ కి మోడీ మరో సాయం.. చైనాకి భారీ షాక్..?

praveen
నేపాల్ భారత్ అంటే రెండు దేశాలు అయినప్పటికీ ఒకే దేశంగా ఉండేవి. సోదర భావంతో ఎన్నో ఏళ్ల నుంచి మెలుగుతూ వచ్చేవి నేపాల్ భారత్ లు. కాని భారత్ ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన చైనా  నేపాల్ పై కన్ను వేసి పాకిస్తాన్ ను తమ అదుపులో పెట్టుకున్నట్లు నేపాల్ ను   కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటివరకు భారత్ తో  సోదరభావంతో మెలిగే నేపాల్ ఆ తర్వాత శత్రువు గా మారిపోయింది. ఏకంగా సోదర దేశమైన భారత్ తో యుద్ధం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం సిద్దమవ్వటం  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఎప్పటికప్పుడు భారత్ను రెచ్చగొట్టే విధంగా నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతూనే  ఉంది.




 అయితే ప్రస్తుతం చైనా బానిస దేశం గా మారిపోయిన నేపాల్ ఏకంగా తమ సరిహద్దులను కూడా చైనాకు అప్పగించి ప్రస్తుతం చోద్యం చూస్తున్న విషయం తెలిసిందే. నేపాల్ ప్రభుత్వం ఎంతలా భారత్ పై  వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ నేపాల్ ప్రజలు మాత్రం ఇప్పటికీ సోదర దేశం అయినా భారత్ పట్ల ప్రేమతోనే ఉన్నారు. అదే ప్రభుత్వానికి ఇది మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి.. అక్కడి ప్రజలలో భారత్ పై  ద్వేషం తీసుకువచ్చే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. నేపా ల్  ఎన్నిసార్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినప్పటికీ.. భారత్ మాత్రం నేపాల్ ను  ఒక దారితప్పిన సోదరుడు గానే  భావిస్తోంది. ఎప్పుడు తమ సోదరభావాన్ని చాటుకుంటూనే ఉంది.




 నేపాల్ కి అవసరమైనప్పుడల్లా సేవా కార్యక్రమాలు చేపడుతూ నే ఉంది భారత్. ఇక ఇటీవలే భారత్ మరోసారి నేపాల్ కి సహాయం చేసి నేపాల్ ప్రజల ప్రేమను గెలుచుకుంది. నేపాల్లో ఆంబులెన్స్ లో కొరత ఉండటంతో.. భారత ప్రభుత్వం ఏకంగా 40 అంబులెన్సులను.. నాలుగు స్కూల్ బస్సులను కూడా నేపాల్ కు పంపించింది.  ఇలా తాము ఇప్పటికీ నేపాల్ ని  సోదర భావంతో నే  చూస్తున్నాము  అని భారత్ ఇన్  డైరెక్ట్ గా చెప్పింది. దీంతో తమ దేశ సార్వభౌమాధికారం హక్కులను చైనా దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధపడ్డ వోలీ శర్మకి.. నేపాల్ ని  ఆధీనంలోకి తెచ్చుకొని భారత్కు షాక్ లు ఇవ్వాలనుకున్న  చైనా కి భారీ షాక్ తగిలింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: