దుబ్బాక ఉప ఎన్నిక.. వారసత్వ విధేయుడెక్కడా..?
దీంతో ప్రస్తుతం దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. దుబ్బాక నియోజక వర్గంలో విజయం తమదేనని టిఆర్ఎస్ ధీమాతో ఉంటే.. ఈసారి ఎలాగైనా విజయం సాధించి తీరుతామని బిజెపి పార్టీ చెబుతుంది . దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నిక కోసం అభ్యర్థుల బెడద కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. అందరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ చివరికి ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. దీంతో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది.
ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఆకస్మికంగా మృతి చెందితే దివంగత ఎమ్మెల్యే కుటుంబంపై ఆ నియోజకవర్గ ప్రజలందరిలో ఎంతో సానుభూతి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రజల మనసుల్లో ఉన్న సానుభూతుతో ఎంతోమంది వారి వారసులు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. దుబ్బాకలో మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ గా మారిపోయింది. ఇటీవలే అనారోగ్యం బారిన పడి మరణించిన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి... మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఇద్దరు కుమారులు కూడా వారి వారసత్వాన్ని అందుకోలేక పోయారు. అందుకే టిఆర్ఎస్ ఇప్పుడు వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు అని తెలంగాణ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.