రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక కష్టాలు తీరనున్నాయి..?

praveen
ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ రూట్లలో మరిన్ని ప్రత్యేకమైన రైళ్లను ప్రారంభించేందుకు నిర్ణయించి రైల్వే ప్రయాణికులు  అందరికీ శుభవార్త అందించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని రూట్లలో ప్రత్యేకమైన రైలు సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించి ఎక్కువ  ప్రయాణికుల రద్దీ ఉండే జోన్ లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ప్రారంభించేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.



 ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం దృశ్య రైలు ప్రయాణాల రద్దీ  ఎక్కువగా ఉన్నందున..  సమస్యలను తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ లోని వివిధ జోన్ లలో  ప్రత్యేక రైళ్లు... జైపూర్- మైసూర్ (సోమ-బుధ) - కర్నూల్ సిటీ, డోన్, ధర్మవరం, మైసూర్-జైపూర్(గురు-శని)- ధర్మవరం,డోన్,కర్నూల్ సిటీ. గోరకపూర్ యశ్వంత్ పూర్(సోమ-శని)- ధర్మవరం యశ్వంత్ పూర్, గోరకపూర్(సోమ-గురు) ధర్మవరం. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- చప్రా(సోమ-శని)- గూడూరు. చప్రా-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (సోమ-బుధ)- గూడూరు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూ ఢిల్లీ డైలీ- గూడూరు, చీరాల, తెనాలి. న్యూ ఢిల్లీ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ డైలీ- తెనాలి, చీరాల గూడూరు.



 ఇక ఏపీ లోని వివిధ రైల్వే స్టేషన్లో ఆగే రైలు సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి... సికింద్రాబాద్- హౌరా, హౌరా- సికింద్రాబాద్ (డైలీ) - పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట సికింద్రాబాద్- గుంటూరు, గుంటూరు- సికింద్రాబాద్ (డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి (తిరుపతి-నిజామాబాద్, నిజామాబాద్-తిరుపతి)- రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి (హైదరాబాద్- విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, దువ్వాడ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: