భార్య అలక భర్త ప్రాణం తీసింది.. ఏం జరిగిందంటే..?
భార్య అలక ఏకంగా భర్త ప్రాణాలు తీసింది. భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లడమే భర్త ప్రాణాలు పోవడానికి కారణం గా మారిపోయింది. భార్య తన పై అలిగి పుట్టింటికి వెళ్ళింది అన్న కారణంతో ఏకంగా భర్త మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గౌతమ్ నగర్ కు చెందిన సత్యనారాయణ లక్ష్మి లకు 2017 లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అంతా బాగానే ఉన్నప్పటికీ కొంత కాలం క్రితం మద్యానికి బానిస గా మారిపోయాడు భర్త సత్యనారాయణ. మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.
ఇక తాగి వచ్చి భార్యతో గొడవపడటమే కాదు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర ఆవేదనకు గురైన భార్య లక్ష్మి బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఓ రోజు ఇంటికి వచ్చేయాలి అంటూ బ్రతిమిలాడాడు. కానీ భార్య మాత్రం భర్త దగ్గరికి వచ్చేందుకు ససేమిరా అంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.