చైనా పుండు మీద కారం జల్లుతున్న భారత్.. ఐడియా అదిరిందిగా..?

Chakravarthi Kalyan
చైనా- భారత్ మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే.. అందులోనూ ఎప్పుడూ శాంత మూర్తిగా ఉండే ఇండియా ఇటీవల రెచ్చిపోతోంది. సరిహద్దుల్లో తేడా వస్తే ఊరుకునేదిలేదని గర్జిస్తోంది. గల్వాన్ ఘటనలోనూ.. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తతల్లోనూ ఇండియా ఎక్కడా ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు.. అవసరమైతే ఎక్కడిదాకా అయినా సిద్దమేనని సమర శంఖం పూరిస్తోంది.

మారిన ఈ భారత్ వైఖరి చైనాకు దడ పుట్టిస్తోంది. అందులోనూ గల్వాన్ ఘటనలోనూ.. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లోనై చైనా సైనికులు పెద్ద సంఖ్యలోనే మరణించారు. మొత్తానికి ఈ వైఖరి చైనాకు పుండుగా మారింది. ఇప్పుడు ఆ పుండుపై భారత్ మరింత కారం జల్లుతోంది. అదేంటంటే.. త్వరలోనే ఇండియా మరో మూడు దేశాలతో కలసి యుద్ధ విన్యాసాలు సైనిక విన్యాసాల పేరుతో ప్రదర్శిస్తోంది. ఇవి విదేశాంగ విధానంలో మామూలే.

కానీ చైనాతో ఘర్షణ వైఖరి నేపథ్యంలో ఇండియా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియా అటు జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సైనిక విన్యాసాలు చేయబోతోంది. దీంతో చైనాకు మరింత మంట మండుతోంది. ఇటీవల చైనాకు భారత్‌ తో అన్నీ చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత తలెత్తుతోంది. కొన్ని దశాబ్దాలుగా మన ఆధీనంలోలేని మన ప్రాంతాలను ఇటీవల భారత సైన్యాలు పునస్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.


దీన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. అలాంటి ప్రాంతాల్లో భారత సైనికులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. అయితే చైనా భారత్ సరిహద్దుల్లో తుపాకీల వాడకం నిషేధం కాబట్టి.. దాడులకు ప్రతిదాడులు కేవలం భుజశక్తితోనే జరపాల్సి ఉంటుంది. అయితే ఇటీవల చైనా సైనికులు మారణాయుధాలతో భౌతిక దాడులు చేస్తున్నారు.. దీంతో మన దేశం కూడా పునరాలోచనలో పడింది. తాజాగా.. సైన్యానికి కొత్త ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా భారత్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు చైనా సైనికులు మరణించారు కూడా. మొత్తానికి భారత్ నిర్ణయాలు చైనాకు కంటగింపుగానే మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: