కరోనా నే.. ఇది మరింత డేంజర్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ తో ఎంతమంది పోరాడుతూ అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కరోనా  వైరస్ బారిన పడి చివరికి మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే ప్రస్తుత సమయంలో కేవలం కరోనా  వైరస్ మాత్రమే కాదు... డెంగ్యూ కూడా ప్రాణాంతకమైన మహామారి గా మారిపోయిన విషయం తెలిసిందే. ఓవైపు కరోనా  వైరస్ తో పోరాటం చేస్తూనే మరోవైపు డెంగ్యూ నుంచి కూడా జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉన్న సమయంలో అనేక రకాల వైరస్ లు  చుట్టుముట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

 ముఖ్యంగా ప్రస్తుత సీజన్లో డెంగ్యూ టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ జ్వరం యొక్క లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ డెంగ్యూ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం రండి. బాడీ టెంపరేచర్ పెరగటం.. వాంతులు, విరేచనాలు కంటి నొప్పి, మంటలు తలనొప్పి, చర్మ సమస్యలు, చిగుళ్ళ నుంచి రక్త స్రావం, మూత్రం, మలంలో రక్తం, కడుపు నొప్పి, జలుబు, దగ్గునీరసం లాంటి లక్షణాలు ఉంటాయట.

 అయితే ప్రాణాంతకమైన డెంగ్యూ జ్వరం ఎక్కువగా దోమల వల్ల వస్తుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ముందుగా ఇంట్లోకి దోమలు రాకుండా ఉండేందుకు పరిసరాల పరిశుభ్రత తో పాటు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. చీకటి పడగానే తలుపులు కిటికీలు మూసి వేయడం ఎంతో  మంచిది. అయితే ప్రస్తుతం సీజనల్ వ్యాధులుగా ఉన్న డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గునియా లాంటి వ్యాధులనుంచి దూరంగా ఉండాలంటే మాత్రం... ముందుగా దోమల నుంచి దూరంగా ఉండడం ఎంతో మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని ఆయిల్'జంక్ ఫుడ్ కి  దూరంగా ఉండి... రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మేలు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: