గుడ్ న్యూస్ : వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. ఇక ఊపిరి పీల్చుకోండి.?
అయితే ఇటీవలే ప్రాణాంతకమైన డెంగ్యూ కి వ్యాక్సిన్ కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ పనాసియ బయోటెక్ తాము డెంగ్యూ వ్యాక్సిన్ కనుగొన్నామని అందరికీ శుభవార్త అందించింది. డెంగ్యూ ఆల్ అనే పేరుతో పనాసియ బయోటెక్ ఈ వ్యాక్సిన్ రూపొందించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉండగా... క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ లకు సంబంధించిన ఫలితాలను విశ్లేషించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కోరినట్లు పనాసియ బయోటెక్ వెల్లడించింది.
అయితే ఇప్పుడు వరకు డెంగ్యూ వ్యాక్సిన్ కు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి అంటూ తెలిపిన పరిశోధకులు... ప్రస్తుతం మూడవ దశలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి అంటూ తెలిపారు. తాము రూపొందించిన వైరస్ ఏకంగా నాలుగు రకాల డెంగ్యూ వైరస్ ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపారు. అంతేకాదు డెంగ్యూ వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలను కూడా ఉత్పత్తి చేస్తుంది అనే విషయాన్ని కూడా వెల్లడించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ వ్యాక్సిన్ డోస్ ఇచ్చాక ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదు అన్న విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రస్తుతం డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వైరస్ బారిన పడుతుండడంతో ఒకేసారి రెండు వైరస్లు ఎటాక్ చేసి ఆరోగ్యం విషమించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ పరిశోధకులు తెలిపారు.