చైనా నాటకం తెలిసిపోయింది.. భారత్ వ్యూహం అదిరింది..?
అయితే ఇటీవలే తమ వ్యూహాన్ని మార్చుకున్న భారత్ టిట్ ఫర్ ట్యాట్ అనే తరహాలో చైనా కు సంబంధించిన పర్వతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో బేరసారాలకు దిగిన చైనా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరుదేశాలు కొత్తగా సరిహద్దుల్లో ఎలాంటి మొహరింపు జరగకూడదని.. అంతేకాకుండా ఇప్పటివరకు జరిగిన మోహరింపులన్నింటిని ఉపసంహరించుకోవాలి అంటూ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఓవైపు సరిహద్దుల్లో సైనికులను వెనక్కి పంపాలి అంటూ ఒప్పందం కుదుర్చుకున్న చైనా... ఆక్సాయ్చిన్ ప్రాంతం లో మళ్లీ మొహరింపు జరుపుతూ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు భారత్ నిఘా వర్గం గుర్తించింది.
దీంతో చైనా అసలు నాటకం కాస్త బయట పడిపోయింది. మోహరింపు ఆపేసాము అని చెబుతూనే ఆక్సాయ్చిన్ దగ్గర భారీగా మోహరింపులు జరుగుతుందట చైనా. అంతేకాదు ఎక్కడ ఉపసంహరణలు కూడా చేయటం లేదు. ఈ నేపథ్యంలో భారత్ కూడా చైనా కు షాక్ ఇచ్చింది. ఏకంగా 12 వేల మంది సైనికులను కొత్తగా మోహరించడం తో పాటు.. యుద్ధ విమానాలను కూడా సరిహద్దుల్లో మోహరించింది భారత్. ఇక ఒప్పందంతో భారత్ వెనక్కి వెళ్తుంది అనుకున్న చైనా కు భారత్ కొత్త మోహరింపులతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో స్థితిలో పడిపోయింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి