ఆధార్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎలా చెయ్యాలో తెలుసా...?

Suma Kallamadi
కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావడం అంత సురక్షితం కాదు కనుక ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయించుకునే అవకాశం కల్పించింది ఐటీ మంత్రిత్వ శాఖ. అయితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయించుకునే వాహన దారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్ళక్కర్లేకుండా ఆన్‌లైన్ ‌లో సేవలను ఇప్పుడు పొందవచ్చు.  వాహనదారులు ఆన్లైన్ లోనే లెర్నర్ లైసెన్స్ పొందడం, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ (డిఎల్), వాహనాల నమోదు (ఆర్సి) మరియు డాక్యుమెంట్ అడ్రస్ మార్చడం వంటి ఆరు రకాల సేవలు సులువుగా పొందవచ్చు.
డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జ్ వంటివి మాత్రమే ఆగస్టు నెలలో అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం డైవింగ్ లైసెన్స్ పునరుద్దరణ మరియు ఆర్సి సంబంధిత ఆన్లైన్ సేవలను ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్) సేవలు తీసుకు రావాలని రహదారి మరియు రవాణా మంత్రిత్వ శాఖ, ఐటి మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. కొందరు డ్రైవర్లు మరియు వాహనాల యజమానులు పొందుతున్న నకిలీ మరియు మల్టిపుల్ లైసెన్సులు, డాక్యుమెంట్లను తొలగించడమే లక్ష్యంగా రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన చేసింది అని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా ప్రజలు తమ ఇళ్ళ నుండి రాకుండానే ఆన్‌లైన్‌ లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అని తెలియ జేయడం జరిగింది.
డ్రైవింగ్ లైసెన్స్ల కోసం ఆధార్ను తప్పనిసరి చేయాలని రవాణా మంత్రిత్వ శాఖ 2018 లోనే నిర్ణయించింది. కానీ మరో తీర్పు రావడం, ఇలా అనేక సంభాషణలు జరిగినప్పటికీ ఆధార్ను ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా స్వచ్ఛందంగా ఉపయోగించుకునే వీలు కల్పించే సవరణ బిల్లును 2019 లో పార్లమెంటు లో ఆమోదించారు. కనుక ఇక పై ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: