7 ఏళ్ల కూతురిని సజీవ దహనం చేసి.. సగం బాడీని నరికి.. చివరికి..?

Suma Kallamadi
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో ఒక తల్లి తన ఏడేళ్ల బిడ్డను తన నివాసంలోనే సజీవదహనం చేసింది. ఏడేళ్ల బాలిక మృతదేహం మంటల్లో కాలిన తర్వాత ఆ భౌతికకాయం లో సగం బాగాన్ని నరికి ఒక నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వచ్చింది తల్లి. ఈ సంఘటన వెలుగులోకి రాగా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని వెంటనే పట్టుకొని ఏడేళ్ల బాలిక బౌతికకాయాన్ని శవపరీక్ష నిమిత్తం వైద్యులకు అప్పగించారు. నిందితురాలికి నలుగురు పిల్లలు ఉన్నారని.. సజీవ దహనం కాబడిన ఏడేళ్ల బాలిక నిందితురాలి చివరి సంతానం అని పోలీసుల విచారణలో తేలింది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.. అమృత్‌సర్ కి చెందిన హరిప్రీత్ కౌర్ కి నలుగురు పిల్లలు. అయితే ఆమె తన భర్తతో తగువులు పెట్టుకుని భర్తకు దూరంగా ఉంటూ తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆ క్రమంలోనే ఆమెకు గురుద్వారాకు చెందిన ఒక సర్వీస్ మ్యాన్ పరిచయం కాగా అతడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అప్పటినుండి భర్త హరిప్రీత్ కౌర్ తో మాట్లాడటం పూర్తిగా మానేసాడు. ఈ క్రమంలోనే హరిప్రీత్ కౌర్ తన ఏడేళ్ల బిడ్డను సజీవ దహనం చేసి సగం భౌతికకాయాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో మూటకట్టి నిర్మానుష్య ప్రాంతంలో విసిరేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు నటిస్తూ తన చిన్న కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కుటుంబ సభ్యులతో కలసి గాలింపు చేపట్టారు. అయితే బాలికను వెతికే క్రమంలో హరి ప్రీత్ కౌర్ కూడా పాల్గొనగా.. ఆమె అనుమానాస్పద ప్రవర్తనను పోలీసులు గమనించి ఆమెను గట్టిగా నిలదీశారు. అప్పుడు తన కూతురిని తానే సజీవదహనం చేసి చంపేశానని చెప్పి అందర్నీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్టు చేసి సొంత బిడ్డను చంపడానికి గల కారణం ఏంటో ఆరా తీస్తున్నారు. అలాగే ఆమె భర్తను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. ఏది ఏమైనా సొంత కూతురునే హరి ప్రీత్ కౌర్ ఎలా చంపగలిగిందో అర్థం కాక స్థానికులందరూ విస్తుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: