ఆ విషయంతో లోకేష్ అడ్డంగా బుక్కయ్యాడు.. రోజా ఘాటు వ్యాఖ్యలు..
ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం విషయంలో మాట్లాడి దొరికిపోయాడు. ఈ విషయం పై తాజాగా స్పందించిన నగిరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనూ చంద్రబాబు, లోకేష్‌లు భారీగా కుంభకోణాలు చేశారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.. అమరావతి లో లక్ష రూపాయల కోట్లకు పైగా టీడీపీ కొల్లకొట్టిందని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో టిడిపి నేతలు చేసిన అవినీతి వల్ల ప్రజలు భారీగా నష్టపోయారు. పావలా ఆశ చూపించి కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో ఉండటానికి కారణం వాళ్ళే అని మండిపడ్డారు. టీడీపీ నేతలు, ఓ సామాజిక వర్గం వాళ్లే అక్కడ భూములు ఎందుకు కొనగలిగారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. చంద్రబాబు గారికి అమరావతి ఏటీఎమ్ లాంటిది అని చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ కూడా అన్నారని ఆమె తెలిపారు. తెలియని కుంభకోణాలు ఎన్నో చేశారు. వాటన్నిటికీ బాబు జవాబు చెప్పాల్సి న టైమ్ వస్తుంది. వారి గుట్టును బయట పెట్టాలంటే సీబీఐ విచారణకు ప్రధాని మోదీ అనుమతివ్వాలని ఈ సందర్భంగా కోరారు.