మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం... అయినా అతని బుద్ధి మారలేదు..?
అతను పలు ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు... మంచి జీతమే వచ్చింది... కానీ అతని జల్సాలకు అది సరిపోలేదు... చివరికి ఐటీ ఉద్యోగానికి స్వస్తి పలికి... కన్సల్టెన్సీ ప్రారంభించి బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఎర వేయటం మొదలుపెట్టాడు. ఇక నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకుంటూ... జల్సాలు చేసాడు చివరికి పోలీసుల వరకు ఈ విషయం వెళ్లడంతో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా తిరువూరు శాంతి నగర్ కు చెందిన చంద్రశేఖర్.. నిజాంపేట వినాయక నగర్ కె ఎన్ ఆర్ కాలనీలో నివసిస్తున్నారు. కోల్ కతాలో పలు మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగం చేశాడు.
మంచి ఉద్యోగం మంచి జీవితం ఉన్నప్పటికీ కూడా అతనికి అది సరిపోలేదు. చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2013లో కేపీహెచ్బీ లో ఓ కన్సల్టెన్సీ ను ప్రారంభించాడు గుణ చంద్రశేఖర్. ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అందరికీ నమ్మబలికాడు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఎర వేయడం మొదలుపెట్టాడు. మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఏకంగా 75 మంది నుంచి రెండు కోట్ల వరకు వసూలు చేశాడు. చివరికి బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో... కటకటాల పాలయ్యాడు గుణ చంద్రశేఖర్.