అంతర్యుద్ధం.. చైనా సైన్యంలో తన్నుకు చచ్చారట.. బయటపడ్డ నిజం..?

praveen
సరిహద్దుల్లో రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా భారత్  దేశాలు భారీగా మోహరింపులు  జరుపుతున్నాయి. అయితే ఇటీవలే చైనా సైన్యం లో ఏకంగా వాళ్లకు తన్నుకుని ప్రాణాలు కూడా తీసుకున్నారు అన్న వాదన ప్రస్తుతం వినిపిస్తోంది. ఇంతకీ చైనా సైన్యం లో గొడవ రావడానికి కారణం కూడా భారత్ అని అర్థమవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒకప్పుడు చైనా సృష్టించిన విధ్వంసానికి టిబెటన్లు అక్కడి నుంచి పారిపోయి భారత్ లోకి వస్తే వారిని చేరదీసి వారికి సదుపాయాలు కూడా కల్పించింది భారత్. వారికి భారత ఆర్మీ లో ఉద్యోగాలు కూడా ఇచ్చి ఇండో-టిబెటన్ ఫోర్స్ ని సిద్ధం చేసింది.



 దీంతో భారత్ పై  టిబెటన్ లకు ఎంతో అమితమైన ప్రేమ ఉంటుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో కూడా టిబెటన్  ప్రజలు భారత సైన్యానికి ఎంతో సహాయం చేస్తున్నారు. ఇలాంటి ఈ క్రమంలో టిబెటన్లను   తాము కూడా ఆకర్షించాలి అనుకున్న చైనా ప్రభుత్వం కొంత మంది టిబెటన్లని సైన్యంలోకి తీసుకుంది. కానీ సరిహద్దుల్లో జరిగిన ఘటన మాత్రం ఊహించలేకపోయింది. టిబెటన్లని  చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎంతో చీప్ గా చూస్తారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సైన్యం లోకి వచ్చిన టిబెటన్ సైనికులతో వాగ్వాదానికి దిగారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరిమధ్య ఘర్షణ చోటు చేసుకుంది.



 ఈ క్రమంలోనే ఏకంగా ఆరు మంది సైనికులు నలుగురు చైనా లిబరేషన్ ఆర్మీ కి సంబంధించిన సైనికులను కొట్టి చంపారట. ఇక ఆ తర్వాత ఇది గమనించిన మిగతా సైనికులు ఆ ఆరుగురు సైనికులను దారుణంగా చితకబాది చివరికి ప్రాణాలు తీశారట. దీంతో ప్రస్తుతం చైనా సైన్యం లో అంతర్యుద్ధం రోజురోజుకి తారస్థాయికి చేరుతుంది అన్న విషయం క్రమక్రమంగా బయటకు వస్తుంది. అయితే అన్ని విషయాలను చైనా రహస్యంగా ఉంచుతోంది కాబట్టి దీనికి సంబంధించి అధికారికంగా బయటికి వచ్చే అవకాశం కూడా లేదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: