పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్.. తర్వాత నచ్చితేనే పెళ్లి.. ఎక్కడో కాదు మన దేశంలోనే..?

praveen
టైటిల్ చూడగానే మనదేశంలో ఇలాంటి వింత ఆచారం కూడా ఉందా  అని అనుమానం మీకు రావచ్చు. కానీ ఇది నిజంగానే మన దేశంలో ఉన్న ఆచారమే. మామూలుగా అయితే మన దేశంలో సాంప్రదాయాల ప్రకారం పెద్దలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. ఆ తర్వాత శోభనం కార్యక్రమాన్ని కూడా పెళ్లి తర్వాత మూడో రోజుకు నిర్వహిస్తారు. ఇది ఏ పెళ్లిలో  అయినా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం వింత ఆచారం ఉంది. పెళ్లి తర్వాత విషయం ముందు శోభనమే . అది కూడా ఒక్క రోజు కాదు ఏకంగా ఏడు రోజుల పాటు.



 అయితే ఎవరికి తెలియకుండా కాదు పెద్దలందరికీ తెలిసి దీనిని ఒక వేడుక జరుపుతారు. తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు లేకపోతే లేదు. ఈ ఆచారం ఎక్కడో కాదు ఇండియాలోని చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో . వివరాల్లోకి వెళితే.. చత్తీస్ ఘడ్  రాష్ట్రం లోని బస్తర్ జిల్లాలో... ఇంద్రావతి నదికి ఉత్తరాన మూయురి  అనే తెగ ప్రజలు నివసిస్తున్నారువీరు  ఇప్పటికీ కూడా పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఈ ఆచారంలో భాగంగా.. యువతి యువకులు ముందుగా ప్రేమించుకోవాలి... ఆ తర్వాత వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియగానే... ఏడు రోజుల పాటు వీరు ఏకాంతంగా గడిపేందుకు ప్రత్యేకంగా గోటుల్  పేరుతో గుడిసెలు ఏర్పాటు చేస్తారు.



 ఈ గుడిసెలో  యువతీ యువకులు పెళ్లికి ముందే ఏకాంతంగా ఏడురోజులపాటు గడపాలి. అయితే యువతీ యువకులు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇలా ఏర్పాటు చేస్తారు. ఇక ఆ గుడిసె వైపు ఎవరూ కూడా వెళ్లరు. అయితే ఈ క్రమంలోనే వారు శృంగారంలో కూడా  పాల్గొనవచ్చు. ఏడు రోజుల పాటు ఒంటరిగా ఉన్న తర్వాత వారికి నచ్చితే అదే యువతి లేదా యువకులను పెళ్లి చేసుకోవచ్చు. లేదా వేరే వాళ్లను పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ తెగ వాళ్ళందరూ ఇప్పటికీ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తుండగా  కొంతమంది మాత్రం ఈ సాంప్రదాయం నచ్చక  పట్టణాలవైపు వలసపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: