చంద్రబాబు దయచేసి మీరు ఇకనైనా మారండి సార్...?

VAMSI
రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం మరియు ఎత్తులు పైఎత్తులు వేసుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. సమయాన్ని బట్టి ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం పైన ఆ పార్టీ నేతల పైన వ్యూహాత్మకంగా మాటల దాడి చేయడం మామూలే. అసలు ఇలాంటి వ్యూహాలు లేకపోతే రాజకీయాల్లో అసలు కిక్కే ఉండదు. ఇటువంటి వ్యూహాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఒక చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యన రాష్ట్రంలో ఏం జరిగినా ముందు ఆ విషయాన్ని ప్రభుత్వంతో ముడిపెడుతూ ఉంది చంద్రన్న బ్యాచ్. విపరీతంగా తన అనుకూల మీడియాతో ప్రచారాలు చేయించడం ప్రతిపక్షానికి బాగా అలవాటు అయిందని విమర్శలు వస్తున్నాయి.


మరోపక్క వైసిపి పార్టీ వారు తమ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని మాకు ప్రజల్లో మంచి కు పేరు వస్తుందని తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబుపై వీలుచిక్కినప్పుడల్లా ప్రతి సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఒకే రోజు రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి.  మొదటిది విజయవాడ కనకదుర్గ దేవాలయం లో వెండి రథానికి ఉన్న నాలుగు సింహాల ప్రతిమలలో మూడు కనిపించడంలేదు. మరొకటి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం. ఈ రెండింటిలో జగన్ ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ సాధారణంగా వినిపిస్తున్న కథనం ప్రకారం దమ్మాలపాటి పై జగన్ ప్రమేయం ఉన్నప్పటికీ, కనకదుర్గ గుడి వ్యవహారంలో ఆయన పాత్ర ఉండబోదని చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టిడిపి మాత్రం కనకదుర్గ వ్యవహారం వైసిపి కి చుట్టేసింది.


ఈ ప్రతిమల అదృశ్యం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని తన అనుకూల మీడియా తో ప్రచారం చేయించింది. దీనిపై పత్రికా కథనాలు కూడా వచ్చాయి. ఇకపోతే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి విషయంలో ఆయన రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపారు అనేది ప్రధానమైన ఆరోపణ. సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనకు సంబంధించి బ్యాంకు లావాదేవీలను తెలుసుకునేందుకు ఏసీబీ వారు ప్రయత్నిస్తారు. ఆయన స్థానంలో ఎవరు ఉన్నా ఇదే జరుగుతుంది కానీ ఇదేదో పెద్ద తప్పు లాగా చంద్రన్న బ్యాచ్ పేర్కొనడం, తరువాత వెంటనే అనుకూల మీడియా ద్వారా ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా అప్పుడెప్పుడో జగన్ పై ఉన్న కేసుల్లో శ్రీనివాస్ వాదించాడని ఇప్పుడు అతని పై జగన్ కక్ష తీర్చుకుంటున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు టిడిపికి ఎటువంటి మేలు చేస్తాయో తెలియదు కానీ, జగన్ పై ప్రభుత్వంపై మాత్రం బురదజల్లే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పాలి. మరి ఇలాంటి పరిణామాలు అవసరమా? ఉన్నది ఉన్నట్టు రాసేందుకు, చెప్పేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు. ఈ విధమైన తప్పులు చేసే కదా 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు ఇకనైనా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకొని ప్రజలకు అండగా ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి బాబు గారు ఇకనైనా మారుతారా లేదా తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ముందుకు సాగుతారా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: