ప్రియుడి మోజులో పడి బిడ్డతో గడప దాటిన తల్లి.. కానీ చివరికి..?
తల్లి వివాహేతర సంబంధం ఏకంగా పిల్లల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రియుడు మోజులో పడి గడప దాటింది ఇల్లాలు. అయితే ఆమె పిల్లలను అడ్డుగా భావించాడు ప్రియుడు. దీంతో మానవత్వం మరిచి ఘాతుకానికి ఒడిగట్టిన దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో పెరుగు లోకి వచ్చింది. పులిచెర్ల మండలం రామి రెడ్డి గారి పల్లి కి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి తో అదే ప్రాంతానికి చెందిన హేమశ్రీ తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అంతా సాఫీగా ఉన్న సమయంలో హేమశ్రీకి అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ తో పరిచయం ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ క్రమంలోనే భర్త పిల్లలను వదిలి తనతో వచ్చేయాలి అంటూ ఉదయ్ కుమార్ హేమశ్రీకి సూచించాడు. దీంతో అర్ధరాత్రి వేళ తన పసిబిడ్డలను వెంటబెట్టుకొని ఆ తల్లి ప్రియుడి కోసం వెళ్ళింది. ప్రియుడి ఆటోలు ఊరి నుంచి బయలుదేరారు. కానీ మార్గమధ్యమంలో ప్రియురాలు ఉంటే చాలు ఆమె పిల్లలు తనకు అడ్డం అనుకున్న ఉదయ్ కుమార్... పసిబిడ్డలు అమానుషంగా చెరువులో విసిరేసాడు. ప్రియుడు తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన హేమశ్రీ పూర్తి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది.. ఆ తర్వాత భయంతో ఉదయ్ కుమార్ కూడా పురుగుల మందు తాగాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.