ఎమ్మెల్సీ గా ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న.?
అయితే ఇందులో ఒక స్థానం కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న పేరును టిఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇటీవల గోరేటి వెంకన్న ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం కూడా ఈ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తుంది . అయితే తెలంగాణ ఉద్యమంలో తన మాటలతో పాటలతో గోరంటి వెంకన్న కీలక పాత్ర వహించారు అన్న విషయం తెలిసిందే.
ఎక్కడ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన దాఖలాలు కూడా లేవు. దీంతో ప్రజా గాయకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గోరేటి వెంకన్న కు గవర్నర్ ఎమ్మెల్సీ కోటలో పదవి ఇచ్చేందుకు టిఆర్ఎస్ సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా... అందులో ఒకటి నాయిని నర్సింహారెడ్డి, మరొకటి రాములు నాయక్.. ఇంకొకటి కర్నే ప్రభాకర్ లకు కేటాయించనున్నారు అనే టాక్ కూడా అధికార పార్టీలో నడుస్తోంది. ఇక చివరి నిమిషంలో గోరేటి వెంకన్న పేరు తెర మీదికి రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న రోజుల్లో టిఆర్ఎస్ అధిష్టానం ఏం నిర్ణయిస్తుంది అన్నది చూడాలి మరి.