పాకిస్థాన్ ఆఖరి ప్రయత్నం.. ఏం జరుగుతుందో..?

praveen
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్తాన్ అన్న విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలను గాలికొదిలేసి ఉగ్రవాదులను పెంచి పోషించి మత రాజ్య స్థాపనే లక్ష్యంగా వివిధ దేశాల పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ ఉంటుంది. దీంతో దేశ అభివృద్ధి జరగలేదు కదా ఏకంగా ఉగ్రవాదులు ప్రభుత్వాలకు సైతం తిరగబడితే పరిస్థితి వస్తుంది. ఎంతో మంది అంతర్జాతీయ టెర్రరిస్టులకు రక్షణ కల్పిస్తూ.. ప్రపంచ దేశాల ముందు ఉగ్ర దేశం గా మారిపోయింది పాక్. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని విడువలేదు.. తమ దేశం రోజురోజుకు ఆర్థికంగా కుంగిపోతున్న.. దేశం దీనస్థితిలో ఉంటున్న కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చింది.



 అయితే ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ముందు పాకిస్థాన్ ఒక దేశంగా  దోషిగా చూపించేందుకు భారత్ ఎన్ని సార్లు ప్రయత్నం చేసింది కానీ..  ప్రస్తుతం ఆ సమయం వచ్చినట్లు  తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి అనుసంధానమైన ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్ ను  బ్లాక్ లిస్టులో  పెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కాగా పాకిస్తాన్  బ్లాక్ లిస్టులో  పెట్టకుండా అడ్డుకునేందుకు రష్యా మలేషియా దేశాలు సిద్ధమవుతున్నాయి . ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్థాన్ చివరి ప్రయత్నం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.




 ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్ష నాయకులు అందరితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకులు అధికార పక్షం కలిసి పాకిస్థాన్ ను  ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో పెట్టకుండా అడ్డుకోవాలని చెప్పారట. పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ఇండియా కావాలని కుట్ర చేస్తోందని ఆరోపించారట ఇమ్రాన్. అయితే  దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ఇప్పటికీ కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని  పెంచి పోషిస్తోంది.. అంతేకాదు ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తులకు కూడా నెలకు 50 వేల రూపాయల పెన్షన్ అందిస్తుంది పాకిస్థాన్ ప్రభుత్వం.. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే  ఉన్నాడన్న  విషయాన్ని కూడా ఇటీవలే వెల్లడించింది. ఇలా తీరు  మార్చుకోకుండా.. తమ దేశాన్ని బ్లాక్ లిస్టులో  పెట్టకుండా ఆపాలి అంటూ పాకిస్తాన్ ఏ ముఖం పెట్టుకొని అడుగుతుందో అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: