కరోనా వైరస్ చైనా ల్యాబ్ లోనే తయారయింది... ఆధారాలు బయటపెట్టిన డాక్టర్ లీ?
ఈమె డ్రాగన్ దేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. నిజానికి కరోనా వైరస్ ను చైనీయులే వారి ప్రత్యేక ల్యాబ్ లో తయారు చేశారని... వాటికి సంబంధించిన ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయని..... వాటిని అతిత్వరలోనే ప్రపంచ దేశాలు ముందుకు తీసుకొస్తానని... చైనా రహస్యాన్ని బయటపెట్టారు. బ్రిటన్ కు చెందిన లూస్ ఉమన్ టాప్ షోలో మాట్లాడిన లి - మెంగ్ యాన్..... ఇదే అసలు నిజం అంటూ వెల్లడించారు..... నిజానికి ఈ చైనా కరోనా విషయం... ప్రపంచ ఆరోగ్య సంస్థకు(W.H.O) ముందే తెలుసని... రెండు విభిన్న వైరస్లు కలిపి ప్రమాదకరమైన కరోనా వైరస్ ను ఎప్పుడో సృష్టించారని.... అయితే ప్రజలకు మాత్రం గత ఏడాది పరిచయం చేసి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారని ఆమె తెలిపారు.
కరోనా వైరస్ సింథటిక్ అని చెప్పిన ఆమె. సైంటిస్టులు కాని వారు కూడా ఈ వైరస్ ను సులభంగా గుర్తించగలరు అని స్పష్టం చేశారు.అందరూ అంటున్నట్లు కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్లోనే తయారయిందని..... అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ కి చెందిన ఓ వైరాలజీ నిపుణుడు మరికొందరు ప్రముఖుల ఆరోపణలలో నిజం ఉందని తెలిపారు.
వైరస్ జన్యు పటం... మన వేలిముద్ర లాగే ఉంటుందని దానిని గుర్తించడం పెద్ద కష్టం కాదని తెలిపారు. చైనా కనుసైగలతో పనిచేసే హాంకాంగ్ అధికారుల నుండి ఆమెకు ప్రమాదం ఉన్నందువల్లనే అక్కడ నుండి బయటపడి ఓ రహస్య స్థావరంలో ఉన్నట్లు వెల్లడించారు.... చైనా.. కరోనా వైరస్ పుట్టుకను గురించి ఊహాన్ వెట్ మార్కెట్ కేంద్రంగా చూపించడం ఒట్టి బూటకమంటూ ఆరోపణలు చేశారు.... అసలు కరోనా వైరస్ ను చైనాలోని మనుషులే తయారు చేశారని.... ఆ డేటా నా దగ్గర ఉందని.... త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టి..... చైనా కుట్రను బట్టబయలు చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లి - మెంగ్ యాన్....ఓ సైంటిస్ట్ గా నేనెప్పుడూ నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాను..... అందుకే ల్యాబ్ లో తయారైన ఇటువంటి అక్రమాన్ని బయట పెట్టడం నా బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు లి - మెంగ్ యాన్.