లాక్ డౌన్ తర్వాత.. కీర్తి సురేష్ మొదటి షూటింగ్ సూపర్ స్టార్ తోనేనట..?
మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించిన తీరు... నేటితరం ప్రేక్షకులందరికీ అసలు సావిత్రి అంటే కీర్తి సురేష్ ఏమో అనేంతలా ప్రభావితం చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది ఈ స్టార్ హీరోయిన్. ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా తన పిల్లల కోసం ఎంతగానో ఆరాటపడి పోయే తల్లిగా కీర్తి సురేష్ నటనకు ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా చిత్రీకరణలు నిలిచిపోయి అందరు సినీ ప్రముఖులు ఇంటి పట్టునే ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులు మొదలవుతున్నాయి. అయితే ఇటీవల ఓ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో... లాక్ డౌన్ తర్వాత కీర్తి సురేష్ చేసిన తొలి సినిమా షూటింగ్ ఏది అన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది కీర్తి సురేష్. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత.. తాను షూటింగ్ లో పాల్గొన్న మొదటి సినిమా... సూపర్ స్టార్ రజినీకాంత్ సర్ తో చేస్తున్న సినిమా అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.