ఆక్స్ ఫర్డ్ గుడ్ న్యూస్.. అందరిలో కొత్త ఆశలు చిగురించాయి..?

praveen
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాల ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యం లో శరవేగం గా ఈ మహమ్మారి వైరస్ కు  వ్యాక్సిన్ కనుగొనేందుకు వివిధ దేశాల్లో  ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరిదశ లో ఉన్నాయి. కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రా జనికా  రూపొందించిన వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ శర  వేగంగా జరిగిన  విషయం తెలిసిందే. ఇక త్వరలో ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటు లోకి వస్తుందని ఎంతోమంది ఆశగా ఎదురుచూశారు. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసిన వ్యక్తికి ఆరోగ్యం విషమించడం కారణంగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్  నిలిచిపోయాయి.




 అయితే ఇటీవలే మరో సారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజనికా  అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. మళ్ళీ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. బ్రిటిష్ రెగ్యులేటర్ నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో... మళ్ళీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు చెప్పింది. అయితే బుధవారం తమ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రా జనికా  ప్రకటించగా... ఇక భద్రతా ప్రమాణాలను సమీక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటై దర్యాప్తు జరిపి... చివరికి క్లినికల్ ట్రయల్స్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రా జనికా క్లినికల్ ట్రయల్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి.




 అయితే బ్రిటన్ లో క్లినికల్ ట్రయల్స్ మొదలైన నేపథ్యంలో భారత్ లోను  ఈ  క్లినికల్ ట్రయల్స్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు వందల కోట్ల డోసులను  ప్రపంచ దేశాలకు అందించడానికి ఆస్ట్రా జనిక సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రా జనిక వ్యాక్సిన్ మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన నేపథ్యంలో అందరిలో మరింత ధైర్యం పెరిగి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: