సైన్యం నిఘా పెట్టారు, వెంటాడారు.. చివరికి ఆ నీచులిద్దరినీ..?
అంతేకాకుండా అక్రమంగా భారత సరిహద్దుల్లో కి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసి మట్టుపెడుతుంది. అదే సమయంలో భారత దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి సాధారణ ప్రజలుగా జీవిస్తూ ఉన్న పాకిస్తాన్ ఉగ్ర స్లీపర్ సెల్స్ గుర్తించి వారిని కూడా అరెస్టులు చేస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు భారత సైన్యం అప్రమత్తంగా ఉండి ఉగ్రవాదుల భరతం పడుతున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని నెలల నుంచి ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు. కానీ ఏదో ఒకరీతిలో భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. జమ్ము కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదు లను భారత భద్రతా దళాలు అరెస్టు చేశారు. ఇక ఇద్దరు ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడు లక్షల రూపాయల నగదును కూడా స్వాధీన పరచుకున్నాయి భారత భద్రతా బలగాలు. ఉగ్రవాద కార్యకలాపాలను చేయడానికి.. యువకులకు మాయమాటలు చెప్పి ఆకర్షించి ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడానికి పాకిస్థాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు కుప్వారా జిల్లాలో పర్యటించనున్నారు అనే కీలక సమాచారం తో.. తనిఖీలు చేపట్టిన భారత భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.