ఎమ్మెల్యే విడదల రజినికి ఫోన్ కాల్ చేసిన దుండగుడు.. ఏమని అడిగాడంటే..?

Deekshitha Reddy
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని సోషల్ మీడియాలో బాగా పాపులర్. వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులకు కూడా ఆమెకు ఉన్న పాపులార్టీ లేదు. ప్రజల్లో మమేకమై, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు రజిని. ఉన్నట్టుండి ఆమెకు ఓ అన్ నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విశాఖ పట్నంకు చెందిన జగజ్జీవన్ గా తనని తాను పరిచయం చేసుకున్న ఆ ఆగంతకుడు సీఎం కార్యాలయం నుంచి తాను ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. అంతే కాదు, సీఎం గారు మీతో మాట్లాడమని చెప్పారంటూ ఎమ్మెల్యేతో మాటలు కలిపాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికి అసలు విషయానికొచ్చాడు. మీ నియోజకవర్గానికి భారీగా రుణాలు మంజూరు చేయాలని సీఎం చెప్పారని, దానికోసమే తానిప్పుడు ఫోన్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మెల్లగా డబ్బులు అడగడం మొదలు పెట్టాడు. రుణం కావాలంటే ముందు కొంత మొత్తం కాషన్ డిపాజిట్ గా చెల్లించాలని చెప్పాడు. అయితే ఈ రుణం వ్యవహారం ఏదో తేడాగా ఉండటంతో.. ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. మళ్లీ కాల్ చేస్తానని చెప్పి.. ఆ ఫోన్ నెంబర్ గురించి ఆరా తీశారు ఎమ్మెల్యే రజిని. సీఎం కార్యాలయంలో జగజ్జీవన్ పేరుతో ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని నిర్థారించుకున్నారు.  అతడితో ఫోన్‌లో మాట్లాడుతూనే డీజీపీతో పాటు గుంటూరు అర్బన్‌ ఎస్పీకి విషయాన్ని చేరవేశారు రజినీ. తర్వాత పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ను కూడా ఇదే వ్యక్తి డబ్బులు అడిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కు కూడా ఇలాంటి ఫోన్ కాల్ రావడం గమనార్హం. మీ నియోజకవర్గానికి 3 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందంటూ ఇండస్ట్రీస్ ప్రాజెక్టు డైరెక్టర్‌ పేరుతో ఎమ్మెల్యే ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ కు శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. లబ్ధిదారుల వాటా కింద 10 శాతం చెల్లించాలన్నాడు. అప్రమత్తమైన ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వ్యవహారం బైటపడింది. ఇప్పుడు ఎమ్మెల్యే రజినీకి కూడా అదే అనుభవం ఎదురైంది. రజినీ కూడా సకాలంలో పోలీసులను సంప్రదించడంతో నిందితుడి ఆచూకీ కనుక్కోవడం సులభమైంది. త్వరలో ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: