గుడ్ న్యూస్.. ఉచిత బస్సు సర్వీసులు..?

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కరోనా  వైరస్ వ్యాప్తి కాస్త తక్కువగా ఉందని అనిపించినప్పటికీ ఆ తర్వాత క్రమక్రమంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యి  ప్రజలందరిలో తీవ్ర భయాందోళన పెంచింది. ప్రభుత్వం కరోనా  వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోయింది. కరోనా  వైరస్ కారణంగా రోడ్డు రవాణా సర్వీసులు అన్ని పూర్తిగా నిలిచిపోయిన  విషయం తెలుస్తుంది.



 దీంతో పట్టణాల్లో ప్రజలు ఏమో కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గిరిజనులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మారుమూల గ్రామాల్లో ప్రజలు కేవలం బస్సుల ద్వారానే ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వెళ్లే వారు  కానీ ప్రస్తుతం ఆ బస్సు సర్వీసులన్ని  నిలిచిపోయిన నేపథ్యంలో... కనీసం ఎటూ వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఆ తర్వాత ఆన్ లాక్ లో భాగంగా బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి కానీ  కరోనా  సంక్షోభం సమయంలో ఉపాధి లేక కనీసం బస్సులో  వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది కొన్ని కొన్ని ప్రాంతాలలో మారుమూల గ్రామాల ప్రజలకు.




 ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తాజాగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం జి.మాడుగుల నుంచి మద్ధి గురువు వరకు ఉచిత బస్సు సర్వీసులను సిఐజీడీ  బాబు ప్రారంభించారు. కరోనా  సమయంలో ఈ ఉచిత బస్సు సర్వీసులు... గిరిజనులకు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. బస్సు ఎక్కేటప్పుడు అందరూ తగిన జాగ్రత్తలు సూచనలు పాటించాలి అని సూచించారు. కాగా ప్రస్తుతం కరోనా  సంక్షోభం సమయంలో ఎలాంటి ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్న గిరిజనులకు ఉచిత బస్ సర్వీసులతో ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: