కరోనా : ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెయ్యి మంది డాక్టర్లు రాజీనామా..?
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ విధి నిర్వహణలో ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్దంగా ఉన్నారు డాక్టర్లు. కరోనా పేషెంట్లు కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు కరోనా వైరస్ బారిన పడి మరణించిన సంఘటనలు కూడా ఉన్న తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి సరైన సదుపాయాలు అందక పోవడం... కరోనా పేషెంట్లకు ఎంతో దగ్గరగా ఉండి చికిత్స అందిస్తూ ఉండటం కారణంగా... ఎంతో మంది వైద్యులు అదే ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏకంగా వెయ్యికి పైగా డాక్టర్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు లెండి బ్రిటన్ దేశం లో. అక్కడ కరోనా ను నియంత్రించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని... అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వెయ్యికి పైగా డాక్టర్లు రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజీనామా చేసిన వైద్యులు అందరూ జాతీయ ఆరోగ్య సేవా కార్యక్రమంలో భాగంగా కరోనా పోరాటంలో భాగస్వాములే . ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ ఉద్యోగాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు వైద్యులు.