బీరు తాగితే శృంగారంలో రెచ్చిపోతారట.. కానీ ఒక్క షరతు..?

praveen
ఏ విషయం అయినా శృతిమించితే అది ఆరోగ్యాని కి ప్రమాదం అని చెబుతూ ఉంటారు వైద్యులు. మనిషి కి ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామం విషయంలో అయినా శృతి మించి వ్యాయామం చేస్తే ఎన్నో  ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మద్యం విషయం లో కూడా అంతే... తగిన మోతాదు లో తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అతిగా తాగితే ఆరోగ్యానికి అంత చేటు చేస్తుంది మద్యం. అయితే బీరు తాగే వారి గురించి తాజాగా అధ్యయనంలో ఆసక్తికర విషయం బయట పడింది. బీరు తాగే వారు శృంగారంలో రెచ్చిపోయి సత్తా చాటుతారట.



 అదేంటి బీరు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి కదా... బీరు తాగడం వల్ల పొట్ట రావడంతో పాటు ఎక్కువగా లావెక్కి పోవడం... ఇతరత్రా ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది కదా... అలాంటిది బీరు తాగితే శృంగారంలో రెచ్చిపోవడం ఏమిటి అనే అనుమానం మీకు రావచ్చు.. అయితే అతిగా కాకుండా తగిన మోతాదులో బీరు తాగితే ఎలాంటి సమస్యలు దరిచేరవట.  పడకగదిలో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.



 తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం.. ఒక చిన్న గ్లాస్ వైన్, లేదా పింట్ బీర్ లో సగం తాగే పురుషుల్లో నపుంసకత్వం బారిన పడే అవకాశాలు 34 శాతం వరకూ తక్కువగా ఉంటాయని అధ్యయనంలో  తేలినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి ప్రభావం కేవలం పురుషులపై ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ అధ్యయనంలో గుర్తించినట్లు  పరిశోధకులు తెలిపారు. మహిళలపై కూడా పరిశోధనలు జరుపగా వారిలో ఎలాంటి మార్పు కనిపించలేదని గుర్తించారు. అయితే నపుంసకత్వం రాదు కదా అని  పరిమితంగా కాకుండా అతిగా బీరు తాగితే అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: