ఆ చిన్ని ద్వీపం.. చైనా ను హెచ్చరించింది.. చివరికి ఛీ కొట్టింది.. కానీ చివరికి..?
చిన్న చిన్న దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని చైనా దగ్గర తాకట్టు పెట్టేందుకు అంగీకరించడం లేదు. దీంతో సరిహద్దు ల్లోకి ప్రవేశించి తమ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా కు చిన్న దేశాలు దీటుగానే బదులిస్తున్నాయి. మరో అతి చిన్న దీవి చైనాకు భారీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సోలమన్ ఇలాండ్స్ లోని మలాట దీవులు తమ దేశానికి చెందినది అని చైనా చెబుతుంది. కాని ఆ దీవులకు చెందిన ప్రజలు మాత్రం చైనా పై చిన్న పాటి యుద్ధమే కొనసాగిస్తున్నారు.
అయితే కేవలం రెండు లక్షల జనాభా మాత్రమే కలిగి ఉన్న మలాట దీవి చైనాకు ఎదురు తిరుగుతూ పోరాడుతోంది. తమ సరిహద్దు లోకి వస్తే ఊరుకోము అంటూ వార్నింగ్ ఇస్తుంది. కానీ చైనా మాత్రం ఆ దీవి ప్రాంతం లోకి వెళ్లి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఒక చైనా బెదిరింపులకు పాల్పడిన ప్రతిసారి చైనాకు లొంగకుండా.. చైనా ను ఛీ కొడుతూనే ఉంది ఆ దీవి. అయినప్పటికీ చైనా మాత్రం ఆ దీవిని స్వాధీనపరచుకునేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఇలా పెద్ద పెద్ద దేశాలతోనూ కాదు చిన్న చిన్న దీవుల నుంచి కూడా చైనా చీదరింపులకి గురి అవుతుంది.2