అమెజాన్ బంపర్ ఆఫర్.. నాలుగు గంటల పని.. రూ.70 వేలు జీతం..!

praveen
ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో ఎంతో మంది ఉద్యోగం కోల్పోయి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కరోనా  కారణంగా ఎక్కడికి వెళ్ళినా ఉపాధి దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎంతో మంది నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్. అందరికీ అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉపాధి కల్పించడంతో పాటు భారీగా డబ్బు సంపాదించేందుకు అవకాశం కల్పించింది ఈ కామర్స్ సంస్థ అమెజాన్. ప్రస్తుతం నిరుద్యోగులు అమెజాన్ తో కలిసి పని చేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.



 ఆర్డర్లను  హోమ్ డెలివరీ చేసి ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. అయితే మీరు ఎంతలా పని చేస్తారు అనే దానిపైనే మీకు వచ్చే ఆదాయం కూడా ఆధారపడి ఉంటుంది. ఫుల్ టైం లేదా పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది అమెజాన్. ప్రస్తుతం ఎంతో మంది డెలివరీ బాయ్స్ గా చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా అమెజాన్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ కస్టమర్లు చేసిన ఆర్డర్లను డెలివరీ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలకు పైగా ఆర్డర్ లను  డెలివరీ చేస్తూ ఉంటుంది అనిఅమెజాన్ . అయితే మామూలుగా ఒక డెలివరీ బాయ్ నాలుగు గంటల సమయంలో 100 నుంచి 150 డెలివరీలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదండోయ్ డెలివరీ బాయ్స్ కి ఒక ఫెసిలిటీ కూడా కల్పించింది. డెలివరీ  బాయ్  డెలివరీ చేయాల్సిన ప్రాంతం అమెజాన్ సెంటర్ కి కేవలం 15 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. కాగా  ఒక ప్రోడక్ట్ డెలివరీ చేస్తే 20 రూపాయల వరకూ  డెలివరీ బాయ్  పొందవచ్చు . ఇక 100 ప్రొడక్టులను డెలివరీ చేస్తే ఏకంగా నెలకు 60 నుంచి 70 వేల వరకు  సంపాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: