ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం దేశాన్ని మార్చగలిగింది. ప్రజలు కూడా ఆయన నిర్ణయాలకు కట్టుబడి ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చారు. ఇందులో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చాడు ఇందులో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది. రీసెంట్ గా ప్రభుత్వ ఉద్యోగుల శక్తిసామర్థ్యాలను పెంచడానికి
మోడీ "మిషన్ కర్మ యోగి" అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ మిషన్ కోసం
ప్రధాని ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థ మూడు విభాగాలుగా ఉంది. దీనికి
కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్లు తెలియజేశారు. దేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెరగడానికి ఎవరికి తగిన పని వారికి అప్పగించడానికి మిషన్ ఉపయోగపడుతుందని
మోడీ తెలియజేశారు. రానున్న ఐదేళ్లలో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 46 లక్షలు కానుందని మరియు మిషన్ కర్మయోగి శిక్షణకు అయ్యే ఖర్చు 510.86 కోట్లు కానుందని ఈ సందర్భంగా
మోడీ తెలిపారు. ఈ మిషన్ మానవ వనరుల నిర్వహణ విధానాలను సమూలంగా మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను తీర్చిదిద్దుతుంది. వారి యొక్క సత్తాను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.
పారదర్శకత సాంకేతిక కలయికతో నవ్య ఆవిష్కరణల దిశగా వారిని సాన పెడుతుందని అన్నారు. 2017 లో ముస్సోరీలో ఐఏఎస్ల శిక్షణ కేంద్రాన్ని ప్రధాన సందర్శించారని తమ తమ విభాగాలకు పరిమితం కాకుండా అన్ని విభాగాల్లో శిక్షణ ఇచ్చేలా శిక్షణ విధానాన్ని మార్చాలన్న ఆలోచనకు అక్కడే నాంది పడిందని
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ
మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో
కేంద్ర ఉద్యోగులకు శిక్షణ కేవలం నిబంధనల ఆధారంగా ఉండేదని కానీ ఇప్పుడు ఉద్యోగి యొక్క పాత్ర ఆధారంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఉన్నత చదువులు మరియు వారి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాలు కొందరు అధికారులకు ఉండేవని, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గతంలో అఖిలభారత సేవలకే పరిమితమైన మిడ్ కెరీర్ ట్రైనింగ్ ను ఇప్పుడు అన్ని సర్వీసులకు అన్ని స్థాయిల్లోని అధికారులకు వర్తింపజేస్తారు అని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిటిహెచ్ లో కర్మయోగి
టీవీ ఛానల్ ఏర్పాటు చేస్తామని అందరి పనితీరు డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటుందని
జితేంద్ర సింగ్ తెలిపారు.