భారత్‌తో యుద్ధం: వాళ్లను తలచుకుని వణికిపోతున్న చైనా..?
ఈ నేపథ్యంలో ఇండియా కూడా సరిహద్దుల్లో సిద్ధంగానే ఉంది. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సైన్యం రెడీ అంటోంది. ఈ సీన్‌లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చైనా.. ఒక్క విషయంలో మాత్రం భారత్‌ను తలచుకుని వణికిపోతుందని సైన్యానికి చెందిన మాజీ అధికారులు విశ్లేషిస్తున్నారు. మరి చైనాను వణికిస్తున్న ఆ అంశం ఏంటో చూద్దామా..
భారత సైన్యంలో ఓ ప్రత్యేకమైన దళం ఉంది. వాస్తవానికి వీరు సైన్యంలోనే ఉండరు. కానీ శత్రువులకు దడ పుట్టిస్తారు. వీటిని స్పెషల్ ఫ్రాంటియర్స్ దళాలు అంటారు. 1962 చైనాతో యుద్ధం అనంతరం స్పెషల్ ఫ్రాంటియర్ దళాలను ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే .. అసలు ఈ దశాల్లో ఉండేది భారతీయులే కాదు.. నిజంగా షాకింగ్ కదా.. అసలు కథ ఏంటంటే.. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న అనంతరం వేలాదిమంది టిబెటన్లు భారత్‌లోకి శరణార్ధులుగా వచ్చారు. వీరిలో కొంతమందితో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ దళంలో టిబెటన్లు, గూర్ఖాలు మాత్రమే ఉంటారు. ఈ దళం నేరుగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకే పని చేస్తుంది.
ఈ దళం ప్రత్యేకత ఏంటంటే.. వీరు స్థానికులు కావడంతో పర్వతప్రాంతాల్లో ఎలాంటి ఆపరేషన్లనయినా సులువుగా నిర్వహిస్తారు. ఆ ప్రత్యేక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే 1962లో మేజర్ జనరల్ సుజాన్‌సింగ్ ఉబన్ ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి పర్వతప్రాంతాలు, లోయలు బాగా పరిచయం అందుకే.. వీరిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అందుకే చైనా దళాలు ఇప్పుడు వీరిని తలచుకున వణికిపోతున్నాయి.