యువ రైతులకు గుడ్ న్యూస్.. కేంద్రం నుండి 3.75 లక్షలు.. ఇలా పొందవచ్చు..?
గ్రామాల్లో ఉన్న యువ రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ రైతులు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం ద్వారా ఓ వైపు రైతులకు మేలు చేయడంతో పాటు తాము కూడా ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కోసం నాలుగున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించేందుకు నిర్ణయించింది. దాదాపుగా 3.75 లక్షల రూపాయలు కేంద్రం రైతులకు సాయిల్ టెస్ట్ కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహకం అందిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సాయం కాకుండా మిగిలిన డబ్బులు రైతులే పెట్టుకోవాల్సి ఉంటుంది.
కేవలం రైతులు మాత్రమే కాకుండా స్వయం సహాయక గ్రూపు, ఫార్మర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లు కూడా కేంద్ర సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో 7949 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లు ఉన్నాయి. వీటి ద్వారా భూ పరీక్షలు చేసి భూమి ఆధారంగా పంటలు వేసి దిగుబడి ఎక్కువగా పొందే అవకాశం ఉంది. ఇలా భూ సారా పరీక్షలు చేయడం ద్వారా ఒక్కో శాంపిల్ కి 300 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://agricoop.nic.in లేదా.. https://soilhealth.dac.gov.in వెబ్ సైట్లలో సమాచారం పొందవచ్చు. లేదా 1800 180 1551 కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.