చైనాలో ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు.. అవన్ని దాచిన రహస్యాలు.?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారినపడి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో శరవేగంగా విస్తరిస్తూ ఎంతో మంది పై పంజా విసురుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది. అయితే ఈ వైరస్ పుట్టినిల్లు చైనా లో మాత్రం ప్రస్తుతం కరోనా  వైరస్ పూర్తిగా తగ్గిన విషయం తెలిసిందే. మొదట్లో కరోనా  వైరస్ పై ఎలాంటి అవగాహన లేదు. ఆ సమయంలోనే చైనా దేశంలో  శరవేగంగా వ్యాప్తిచెందింది  కరోనా  వైరస్. కానీ  చైనాలో  కేవలం 85 వేల కేసులు... నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి.




 అయితే చైనాలో కరోనా  గణాంకాలు పై అమెరికా ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో 6 మిలియన్ల మందికిపైగా వైరస్ బారిన పడగా 1.8 లక్షల మంది చనిపోయారు. బ్రెజిల్లో 1.22 లక్షల మంది చనిపోయారు. భారత్లో 66 వేల మందికి పైగా కరోనా  బారినపడి మృత్యువాత పడ్డారు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దేశాలలోనే ఈ  రేంజిలో మరణాలు కేసుల సంఖ్య ఉంది.. మరి  చైనాలో మాత్రం అంత తక్కువ ఎలా అనే అనుమానాలు ప్రపంచ దేశాల్లో  నెలకొన్నాయి.



 ఈ క్రమం లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా  ప్రపంచ దేశాలపై చైనా ప్రయోగించిన ఒక బయో వెపన్ అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా చైనా కు ముందుగానే కరోనా వైరస్ గురించి తెలిసినప్పటికీ నిజాలను దాచిపెట్టి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందేలా చేసింది అంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అయితే తాజాగా మరోసారి చైనా పై విరుచుకుపడిన డోనాల్డ్ ట్రంప్ కరోనా  వైరస్ నేపథ్యంలో చైనా  చూపించిన లెక్కలు అన్ని  అవాస్తవం అంటూ తెలిపారు. చైనాలో ఏకంగా లక్షకుపైగా కరోనా  మరణాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించిన ట్రంప్ .. నిజాలను  చైనా దాస్తుంది అంటూ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు కేసులు ఒక చైనా లో మాత్రమే ఉన్నాయని కానీ చైనా ఈ విషయాలను బహిర్గతం చేయడం లేదు అంటూ ట్రంప్  చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: