బడికి వెళ్లాల్సిన బాలిక పనికి వెళ్ళింది.. చివరికి అతని కన్నుపడి గర్భవతి అయింది.?

praveen
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతున్న కుటుంబం లో రోజు రోజుకి కుటుంబ పోషణ భారం కావడం తో... ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును బడికి పంపాల్సింది  పోయి తల్లిదండ్రులు ఎంతో బాధతో పనికి పంపారు. కూతురు కూడా పనిచేస్తే వచ్చిన డబ్బులతో కాస్త కుటుంబ పోషణ భారం తగ్గుతుందని తల్లిదండ్రుల భావించారు. కానీ తమ కూతురు బ్రతుకు అయోమయంలో పడిపోతుందని మాత్రం ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. మైనర్ బాలికపై యజమాని కన్నేసి బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. చివరికి ఆ చిన్నారి బాలిక గర్భం దాల్చింది. దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 జిల్లాలోని వలేటివారి పాలెం కి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక గత కొంత కాలం నుంచి ఆర్థిక ఇబ్బందుల తో సతమతమవుతున్న తల్లిదండ్రులు.. రోజురోజు కుటుంబ పోషణ భారం కావడం తో... కుమార్తెను... యుగంధర్ నాగమణి దంపతుల వద్ద పనికి కుదిర్చారు. సోఫాలు కుర్చీలు అమ్ముకుంటూ జీవనం సాగించే వారి దగ్గర పనికి పెట్టగా ... సదరు దంపతులు బాలికను ఢిల్లీ తీసుకెళ్లారు. కానీ  అంతలోనే ఆ తల్లిదండ్రులు ఊహించని ఘటన చోటు చేసుకుంది. పనికి వచ్చిన చిన్నారి  పై కన్నేసిన యజమాని.. బెదిరించి  పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.




 ఇది తప్పు అని చెప్పి అడ్డుకోవాల్సిన భార్య బాలికపై అత్యాచారం చేసేందుకు భర్తకు సహకరించింది . ఆ తర్వాత కొన్నాళ్లకే బాలికను తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే ఓరోజు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా బాలిక గర్భం దాల్చింది అన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: