టీఆర్ఎస్‌లో మళ్లీ అసమ్మతి గళం మొదలైందా..?
దీంతో అసమ్మతి సెగ ఆదిలోనే చల్లారిపోయింది. కానీ అది అనుకున్నంతగా సద్దుమనగలేదని, అసమ్మతి సెగ ఇప్పటికీ రగులుతూనే వుందని, అదను చూసుకుని కాటేయడానికి రెడీ అవుతోందనే సంకేతాలు మళ్లీ మొదలయ్యాయి. శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తాజా వ్యాఖ్యలు ఇందుకు అద్దంపడుతున్నాయి. సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్‌ని ఆ తరువాత కేసీఆర్ మండలి ఛైర్మన్‌ని చేసిన విషయం తెలిసిందే. అయితే పదవీకాలం ముగిశాక స్వామిగౌడ్‌ని పక్కనబెట్టి గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే స్వామిగౌడ్‌కు రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశ వుందట.
గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి టిక్కెట్ ఆశించినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో స్వామిగౌడ్ అసమ్మతి గళం వినిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని స్వామిగౌడ్ పొగడ్తల్లో ముంచెత్తడానికి కారణం కూడా అదేనని, తనని పక్కన పెట్టారన్న కోపంతో స్వామి గౌడ్ రేవంత్‌ని పొగుడుతూ పార్టీకి సంకేతాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. స్వామి గౌడ్‌తో పాటు తాజాగా పద్మారావు, శ్రీనివాస్ గౌడ్ కూడా తోడవ్వడంతో టీఆర్ఎస్‌లో మళ్లీ అసమ్మతి గళం ఊపందుకునే అవకాశం వుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మధుసూధనాచారి, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి లాంటి నేతలు ఇప్పటికే రగిలిపోతోన్న సంగతి తెలిసిందే.