ఆస్తికోసం సొంత బామ్మనే బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే? ఎంత దారుణం?

VAMSI

అసలు ఈదేశం ఎక్కడికి వెళ్తోంది. మనుషులు మానవత్వాన్ని మరిచి బంధాలకన్నా మనం సంపాదిస్తున్న డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నారు. ఈ సమాజములో ఎంతో మంది మనుషులు, ఎన్నో బంధాలు ఈ డబ్బు వలన నాశనమైపోయాయి. బ్రతకడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే బ్రతుకు కాకూడదు.  మనసమాజంలో అన్నదమ్ములు..... అక్కచెల్లెలు.....తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు రావడం సర్వసాధారణం. ఇలాంటివి దాదాపుగా వారిలో వారు పరిష్కరించుకోవడమో, బంధువుల సహాయంతో పరిష్కరించుకోవడమో, పంచాయతీ పెద్దలసహకారంతో పరిష్కరించుకోవడమో లేదా రాజకీయనాయకుల జోక్యంతో పరిష్కరించుకోవడమో జరుగుతుంటుంది. ఇంకా కొంచెం పెద్ద తగాదాలు అయితే పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదు.


అలాంటి ఓ సంఘటన ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో ఆస్తి తగాదాలకు సంబంధించి సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ గొడవ సరాసరి ఎమ్మెల్యే కు తగిలింది. ఆస్తి తగాదాల పంచాయితీలు చేయవలసిన ఎమ్మెల్యే పైన బెదిరింపు ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ కి చెందిన రాయ్ బరేలి  ఎమ్మెల్యే అదితి సింగ్ పై ఆమె బామ్మ కమలా సింగ్ సంచలన ఆరోపణలు చేసారు. ఆస్తి కోసం నా మనుమరాలు నన్ను వేధిస్తోంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తును ప్రారంభించాలని ఎస్పీ స్వప్నిల్ మాంగేన్ ఆదేశించారు. ఫిర్యాదు చేసిన కమలా సింగ్ ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి వస్తుందని పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఈయన తెలిపారు.


డిసెంబర్ 30 2019 న అదితి సింగ్ వారి కుటుంబ సభ్యులు తమ ఇంట్లోకి ప్రవేశించి ఆస్తి మొత్తం వారి పేరుమీద మార్చాలని నన్ను బెదిరించారని కమలా సింగ్ ఆరోపించారు. అయితే ఈమె ఆరోపణలపై అదితి సింగ్ ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ తరపున గెలిచిన అదితి తర్వాత బీజేపీ లో చేరారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని ఈ మధ్య కాంగ్రెస్ స్పీకర్ ను కోరింది. అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జరిగింది. బీజేపీ లోకి వెళ్లిన అదితి సింగ్ లో పార్టీ లక్షణాలు కనిపిస్తున్నాయని పెద్దలని గౌరవించాలని బీజేపీ వారు ఈమెకు నేర్పలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వారి కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ కు నైతిక విలువలు లేవని బీజేపీ ప్రతి విమర్శ చేసింది. మరి ఈ కేసు బామ్మ కమలా సింగ్ కి అనుకూలంగా మరి అదితి సింగ్ నుండి బెదిరింపులు ఆగుతాయో లేదో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: