యాంకర్ ప్రదీప్ పై నిర్భయ కేసు.. వాళ్ళు డిమాండ్ చేయటంతో..?

praveen
నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతి ఏకంగా తన పై 139 మంది అత్యాచారానికి ఒడిగట్టారు అంటూ కొంతమంది సినీ ,  రాజకీయ ప్రముఖుల పై ఆరోపణలు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తుల పేర్లను సైతం సదరు మహిళా ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లై భర్తతో విడిపోయినా తాను ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన సమయంలో... మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి వ్యభిచార కూపంలోకి దింపగా ... ఆ తర్వాత ఏకంగా 139 మంది తనపై అత్యాచారం చేశారని... అందులో యాంకర్ ప్రదీప్ తో పాటు ఎంతోమంది ప్రజాప్రతినిధుల సహాయకులు ఉన్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.




 అయితే ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది. కేసులో సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు ఉండటంతో ఈ కేసు విచారణలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ పై నిర్భయ కేసు నమోదైనట్లు  తెలుస్తోంది. అయితే సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు పై పెద్ద ఎత్తున నిరసనలు మొదలవడంతో పోలీసులు యాంకర్ ప్రదీప్ పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దళిత యువతి కాబట్టే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని.. దళిత సంఘాలు నిరసనకు దిగినట్లు తెలుస్తుంది.



 గతంలో ఓ యువతిపై అత్యాచారం జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేశారని.. ఇప్పుడు దళిత యువతి విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ దళిత సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టాయి. దీంతో  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏకంగా వంద పేజీలకి పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.  యువతి తనపై అత్యాచారం చేశారు అంటూ ఫిర్యాదు చేసిన అన్ని పేర్లను కూడా  ఈ ఎఫ్ఐఆర్ లో  ఉంచినట్లు  తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో విచారణలో ఎలాంటి నిజాలు బయట పడతాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: