ఆ దేశంతో భారత్ కొత్త ఒప్పందం.. చైనాలో టెన్షన్ టెన్షన్..?

praveen
కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో కి వచ్చినప్పటి నుంచి ఇతర దేశాలతో  సత్సంబంధాల ను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ ఆస్ట్రేలియా జపాన్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది భారత్. ఆయా దేశాలతో ఇప్పటికే భారత్ ఎన్నో వాణిజ్యపరమైన ఒప్పందాల ను చేసుకుంది. అన్ని రకాలుగా ఒప్పందాలు చేసుకుంటూ ప్రస్తుతం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటుంది  భారత ప్రభుత్వం,


 కేవలం వాణిజ్య పరమైనవి కాకుండా సైనిక అవసరాల రీత్యా కూడా పలు దేశాలతో ఒప్పందాలు పెట్టుకుంటుంది భారత ప్రభుత్వం. ఇప్పటికే వివిధ దేశాల తో సైనికపరమైన బంధాలు వాణిజ్యపరమైన బంధాలను పెట్టుకున్న భారత్  ప్రస్తుతం సాంస్కృతిక పరమైన బంధాలను కూడా పెట్టుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సాంస్కృతిక పరమైన బంధాలు అంటే ఒకరకంగా ఆ దేశాన్ని సోదర దేశంగా అంగీకరించినట్లే అవుతోంది. అయితే ఇజ్రాయిల్ భారత్ కి ఎప్పటి  నుంచొ  మిత్రు దేశంగా  కొనసాగుతున్న విషయం తెలిసిందే, ఇజ్రాయిల్ భారత్ దేశాల మధ్య సంబంధాలు కూడా ఎంతో పటిష్టంగా ఉన్నాయి.





 అయితే ఇప్పటికే ఇజ్రాయిల్ దేశం తో ఎన్నో వాణిజ్య,  సైనికపరమైన ఒప్పందాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్ ప్రస్తుతం ఇజ్రాయెల్ తో సాంస్కృతిక పరమైన ఒప్పందాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఒప్పందంతో ఇజ్రాయిల్  సంస్కృతిని భారత్... భారత సంస్కృతిని ఇజ్రాయిల్  పుచ్చుకునేటువంటి ధోరణి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పటికే వాణిజ్యపరమైన సైనికపరమైన ఒప్పందాల నేపథ్యంలో క్లిష్టపరిస్థితుల్లో ఇజ్రాయిల్ భారత్ కి ఎప్పుడు అండగా ఉంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఒప్పందంతో ఇజ్రాయిల్ భారత్ మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుత పరిణామాల్లో నే కాదు ఈ ఒప్పందం భవిష్యత్తు పరిణామాల్లో కూడా భారత్ కు  ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: