మరో భారీ కుంభకోణం లో అచ్చెన్నాయుడు ? ఎన్ని వందలకోట్లు అంటే..?

P.Nishanth Kumar
ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రిమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉండబోతున్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు కలవరాన్ని సృష్టిస్తున్నాయి.. అయితే ఈ ఎస్ ఐ స్కాం ని మించి అవినీతి ఈ కుంభకోణం లో ఆయన ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఒక అవినీతి కేసుతో విలవిల లాడిపోతున్న అచ్చెన్న మరో అవినీతి కేసులో ఉన్నట్లు రుజువైతే మాత్రం ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పవనిపిస్తుంది..


తాజగా ఆప్కో లో భారీ కుంభకోణం జరిగిందన్న ఫిర్యాదుపై సిఐడి దర్ప్యాప్తు చేస్తుంది. చంద్రబాబు హయంలో ఆప్కో చైర్మన్ గా పనిచేసిన కడపజిల్లా కాజీపేట కు చెందిన గుజ్జల శ్రీనివాసుల ఇల్లు, కార్యాలయాల్లో నిన్న ఈరోజు సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీనివాసులు చైర్మన్ గా ఉన్న సమమయంలో ఆప్కో లో నకిలీ సంఘాల ద్వారా 4 వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని చేనేత సంఘాల సమాఖ్య జగన్ కి ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన సిఐడి ఆప్కో లో జరిగిన అవినీతిని తేల్చే పనిలో పడింది..


అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం గత ప్రభుత్వం సమయంలో అచ్చెన్నా జౌళీ శాఖ మంత్రిగా బాధ్యలు నిర్వర్తించారు.2017 లో చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత అచ్చెన్నా  రవాణ, బీసీ సంక్షేమం, చేనేత, జౌళీ శాఖలు దక్కాయి. అయితే మొదటి అర్ధభాగంలో కార్మికశాఖ నిర్వహించగా అక్కడే ఈ ఎస్ ఐ స్కాం చేసి వందల కోట్లు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి.. ఇక రెండో అర్ధభాగంలో చేనేత శాఖకు సంబంధించిన ఆప్కోలో 4 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఫిర్యాదులతో విచారణ చేస్తుంది సీఐడీ.. అయితే ఈ విచారణ పూర్తయ్యే లోపు ఈ అవినీతి అచ్చెన్న మీదకు తప్పకుండా వస్తుందని అంచనా వేస్తున్నారు.. ఇదే జరిగితే అచ్చెన్నా మరోసారి తిప్పలు తప్పవనిపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: