బాబోయ్.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా 2.0..?

Chakravarthi Kalyan
అబ్బే కరోనా అనుకున్నంతగా ఇప్పుడు పవర్ ఫల్ గా లేదు.. కరోనా వీక్ అయిపోయింది.. కరోనా అంటే జనం కూడా భయపడటం మానేశారు.. ఇలాంటి కామెంట్లు తరచూ వింటున్నాం.. కానీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మరో వార్త ఇప్పుడు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అదేంటో తెలుసా.. కరనాలో కొత్త వెర్షన్ వస్తోందట. అది బాగా అప్‌డేట్ అవుతోందట. ఈ కొత్త వర్షన్ కరోనా.. పాత దానికంటే.. పది రెట్లు డేంజర్ అట.


ఈ విషయాన్ని మలేసియా సైంటిస్టులు కనిపెట్టారు. ప్రస్తుత కరోనా వైరస్‌ రకాల కన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ఒక కొత్త రకాన్ని గుర్తించినట్లు మలేసియా సైంటిస్టులు ప్రకటించారు.  ఈ కొత్త రకాన్ని డీ614జీ’గా పిలుస్తున్నారు. ఒక వైరస్ ఇలా కొత్త రూపం సంతరించుకోవడం సాధారణ విషయమే.. కాకపోతే ఇలా మార్పు చెందే క్రమంలో తన పాత రూపంలోని ఘాడతను అది కోల్పోతుంటుంది. కానీ ఈ కరోనా వైరస్ మాత్రం కొత్త  మార్పుతో మరింత శక్తివంతంగా మారుతోందట.  


ఇంతకీ ఈ వైరస్‌లోని మార్పు ఎలా గమనించారో తెలుసా.. అది మన ఇండియన్ కారణంగానేనట. భారత్‌ నుంచి తిరిగొచ్చిన ఒక రెస్టారెంట్‌ యజమాని క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించి తన కరోనాను మరో 50 మంది వరకూ అంటించాడట. వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు ఈ కొత్త వైరస్‌ ఉత్పరివర్తనను మలేసియా సైంటిస్టులు కనిపెట్టారు. ఆ 50 మందిలో ముగ్గురికి ‘డీ614జీ’ రకం కరోనా వైరస్‌ సోకిందని తేల్చారు.


మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త రకం ఇప్పటికే అమెరికా, యూరప్‌లో కనిపించిందట. సో.. దీనివల్ల అర్థమయ్యేదేంటంటే.. కరోనా వైరస్ కాస్త వీక్ అయినా కరోనా 2.0 వెర్షన్‌తో మరింత శక్తివంతంగా రూపొందే అవకాశాలు ఉన్నాయి. అంటే మరోసారి కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించే ప్రమాదం కూడా పొంచి ఉందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: