గంటాకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కారణం ఇదా ?
కొద్దిరోజుల క్రితం జగన్ నుంచి గంటా చేరికకు గ్రీన్సిగ్నల్ వచ్చిందని, ఆగస్టు 16వ తేదీన ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. దీనికి కారణం వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు, వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అలాగే గంటా అవినీతి వ్యవహారాలకు సంబంధించి ఓ మీడియా ఛానల్ లోనూ ప్రత్యేక కథనం ప్రచారం అవడంతో, ఇప్పుడు గంటాను చేర్చుకోవడం ద్వారా, అనవసర తలనొప్పులు వస్తాయనే అభిప్రాయంతో జగన్ ఆయన రాకకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.
గంటా ఏ పార్టీలో చేరినా, ఆయన ఆ పార్టీ అభివృద్ధికి పాటుపడకుండా, పూర్తిగా తన వ్యాపార లావాదేవీలు పైనే దృష్టి పెడతారని, ఆయనను చేర్చుకోవడం వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదని, కేవలం ఆయనకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది అనే ఈ విషయాన్ని జగన్ దృష్టికి కొంత మంది పార్టీ నాయకులు తీసుకు వెళ్లినట్లు సమాచారం. అలాగే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మేనల్లుడు విజయ్ ద్వారా అనేక అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా ఆధారాలతో జగన్ వద్దకు ఫైల్ వెళ్లడంతో గంటకు రెడ్ సిగ్నల్ పడినట్లు ఇప్పుడు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.