గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన సీఎం జగన్..?
ముఖ్యంగా భద్రాచలం వద్ద 58 అడుగులకు మించి నీటిమట్టం నమోదు కావడం గమనార్హం, దేవీపట్నం లో మొత్తంగా 36 గ్రామాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోయాయి. ఇక గ్రామాలు మొత్తం జలమయం కావడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అటు ఉభయ గోదావరి జిల్లాలలో కూడా వరదల ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది, భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో గ్రామాలకు గ్రామాలు జలమయం అయ్యి జనజీవనం స్తంభించి పోతుంది, ఇక క్రమక్రమంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగిపోతోంది.
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత రెండు మూడు రోజుల నుంచి భారీ మొత్తంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వరద ఉద్ధృతి మరింతగా పెరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. గోదావరి వరద ఉదృతి పై అధికారులను ఆరాతీసి పలు వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సీఎం ఆఫీస్ కు వరద ఉధృతికి సంబంధించిన సమాచారం అందించాలని ఆదేశించారు. పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు సీఎం జగన్. అంతేకాకుండా ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రమాదం ఉందని అనిపిస్తే ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు, కృష్ణాజిల్లాలో కురుస్తున్న వర్షాల పై పరిస్థితులపై కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.