17వేల అడుగుల ఎత్తులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న జవానులు..!

Suma Kallamadi
భారత దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి దాదాపు 90 నిమిషాల పాటు అనేక అంశాలపై మాట్లాడారు. కరోనా యోధుల నుండి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన ఫ్రీడమ్ ఫైటర్స్ వరకు మోదీ తన తల వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిలటరీ, పారామిలటరీ, పోలీస్ వ్యవస్థ భారత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే భారత జవాన్లు తమ డ్యూటీ చేస్తూనే 74వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకున్నారు.




ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జవాన్లు తాజాగా లడఖ్‌లో 17,000 అడుగుల ఎత్తులో భారత జాతీయ జెండాను ఎగురవేసి 74 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని బాగా జరుపుకున్నారు. ఐటిబిపి జవానులు సరిహద్దులో ఉన్న వివిధ వ్యూహాత్మక ప్రదేశాలకు తిరుగుతూ అనేక ప్రాంతాల్లో భారత జెండాను రెపరెపలాడించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరుపుకున్న వేడుకలకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.




21 మంది ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్ల సిబ్బంది సరిహద్దు వద్ద చైనా దళాలను పారద్రోలడానికి ఆర్మీతో కలిసి ధైర్యసాహసాలతో పోరాడారని.. ఆ 21 మంది జవాన్ల ధైర్యానికి గుర్తింపుగా పతకాలను సమర్పించ వలసిందిగా ఐటిబిపి భారత  ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏదేమైనా ఆ రోజున భారత దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మహామహులు ఎంత కష్టపడ్డారో ఈ రోజున భారతీయుల స్వతంత్రాన్ని కాపాడేందుకు ఆర్మీ జవాన్లు అదే స్థాయిలో కష్టపడుతున్నారు. అందుకే ఈరోజున ప్రతి ఒక్క భారతీయుడు భారత సైనికులకు నిలుచుని సెల్యూట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: