తెలంగాణలోని ఆ జిల్లాలో ఒకే వీధిలో 16 మందికి కరోనా...?

Reddy P Rajasekhar
కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో నగరాల్లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందింది. నగరాల్లో, పట్టణాల్లో మాత్రమే భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే కాలక్రమేణా వైరస్ నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. ప్రస్తుతం పల్లెల్లో సైతం భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
 
తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. సాధారణంగా శ్రావణం మొదలైందంటే పెళ్లిళ్ల సందడి ఉంటుంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం పది లక్షలకు అటూఇటుగా పెళ్లిళ్లు జరిగితే శ్రావణమాసంలో మాత్రమే దాదాపు 4 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే కరోనా వైరస్ విజృంభణ వల్ల పెళ్లిళ్లు జరుగుతున్నా సందడి కనిపించడం లేదు. చాలామంది కరోనా వల్ల తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు.
 
అయితే ఈ పెళ్లిళ్లే కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. తక్కువ సంఖ్యలోనే పెళ్లికి హాజరవుతున్నా ఒకరికి వైరస్ సోకిందంటే ఇతరులకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18 మందికి వైరస్ నిర్ధారణ అయింది.  వైరస్‌ సోకిన వారిలో 16 మంది పట్టణంలోని ఒకే వీధికి చెందిన వారని అధికారుల విచారణలో తేలింది.
 
ఇటీవల వీరంతా వివాహ వేడుకకు హాజరైనట్లు హాజరయ్యారని అక్కడే వారికి కరోనా సోకిందని సమాచారం. ధర్మపురి పట్టణంలో వారం రోజుల క్రితం ధర్మపురికి చెందిన అమ్మాయికి, మంచిర్యాలకు చెందిన అబ్బాయితో వివాహం జరిగింది. వివాహానికి హాజరైన వారిలో చాలామంది కరోనా భారీన పడ్డారు. ఒకే వీధిలో 16 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు కాలనీల్లో కెమికల్స్ ను పిచికారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 2,000 లోపే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: