కరోనా ఎఫెక్ట్.. కనిపించని చిన్ని కృష్ణులు.. కల తప్పిన కృష్ణాష్టమి..?
అయితే ప్రతి ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు రెండు రోజుల పాటు భక్తులు జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని మధురకు ఎంతో మంది భక్తులు చేరుకుని శ్రీకృష్ణ పూజలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం భక్తులకు అనుమతి లేకపోవడం అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా అటు ప్రజలు కూడా కాస్త వెనుకడుగు వేస్తున్న తరుణంలో ఎవరు కూడా ఆలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించడం లేదు, ఇలా ఎంతో ఘనంగా జరగాల్సిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు కాస్తా ప్రస్తుతం బోసిపోయినటు గానే జరుగుతున్నాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల కోలాహలం ఎక్కడ కనిపించడం లేదు.
ఒకవేళ పాఠశాలలు తెరుచుకొని ఉంటే అక్కడ చిన్ని చిన్ని గోపికలు... చిన్నచిన్న కృష్ణుయ్యలు ఎంతగానో సందడి చేసేవారు. కృష్ణా గోపికల వేషధారణలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కనువిందు చేస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటిది ఎక్కడా కనిపించడం లేదు. చిన్ని చిన్ని గోపికలు చిన్ని చిన్ని కృష్ణుయ్యలు అందరూ ఇంటికే పరిమితమై పోయారు. అయితే శ్రీ కృష్ణ జన్మాష్టమి అయినప్పటికీ కరోనా వైరస్ మార్గదర్శకాలను పాటించిన నేపథ్యంలో మధుర బృందావనం గోవర్ధన్ , నందగావ్, గోకుల్, మహావన్, బల్దేవ్ తదితర పుణ్యక్షేత్రాలు ఈనెల 13వ తేదీ వరకు మూసివేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు, అంతేకాకుండా మస్కన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ సారి ఏకంగా నిర్వహించనున్నారు నిర్వాహకులు.