అతనికి 19, ఆమెకు 26.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ ఆ తర్వాతే అసలు నిజం బయటపడింది..?
ఫేస్ బుక్ ప్రేమ ఇక్కడ వరకు దారి తీసింది. వరంగల్ జిల్లాకు చెందిన యువతికి... హైదరాబాద్ కు చెందిన యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. యువతి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఫేస్ బుక్ లో పరిచయమైన అనూష రాకేష్ ల మధ్య పరిచయం కాస్తా స్నేహానికి దారితీస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని రోజులు కొనసాగిన తరువాత అకస్మాత్తుగా వరంగల్ జిల్లా నందవరం కి చెందిన అనూష... తనను హైదరాబాద్ చెందిన రాకేష్ పెళ్లి చేసుకుని ఆ తర్వాత తల్లిదండ్రులను కలిసి వస్తానని చెప్పి ముఖం చాటేశాడు అంటూ చెప్పుకొచ్చింది. న్యాయం చేయాలంటూ వరుడు ఇంటి ముందు బైఠాయించింది.
పెళ్లి చేసుకుని తనతో కాపురం చేయకుండానే పరారయ్యాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అతన్ని ఎంతో ప్రాణంగా ప్రేమించానని చివరికి ఇలా రోడ్డుపాలు చేస్తాడు అని అనుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనకు న్యాయం చేయాలంటూ యువకుడి ఇంటి ముందు బైఠాయించడంతో మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి, వెంటనే మహిళా సంఘాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాయి, అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపి... న్యాయం చేస్తాము అంటూ హామీ ఇచ్చారు. అయితే చివరి లో ట్విస్ట్ ఏమిటీ అంటే.. ఆ యువకుడు యువతి కంటే చిన్నవాడు. అతని వయస్సు 19 యేళ్లు అయితే యువతి వయస్సు 26 యేళ్లు.