తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ !
కృష్ణా నదితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌లకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 29వేల 429 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా .. 42వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 848.30 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 215 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం 76.48 టిఎంసీలు నీరు ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
తుంగభద్ర డ్యామ్‌కు కూడా భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్‌కు 81వేల 218 క్యూసెక్కులు వస్తోంది. డ్యామ్ నుంచి 8వేల 225 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 100 టీఎంసీలు కాగా.. ప్రసుత్తం 46.టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ప్లో 42వేల 378 క్యూసెక్కులు ఉండగా 10వేల 622 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 556 అడుగుల వరకు నీరు చేరింది. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాలువలకు నీరు విడుదల చేశారు అధికారులు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. హోరువానలతో ఎగువ నుంచి వెల్లువలా వరద తన్నుకొస్తోంది. దీంతో లక్ష్మీ పంపుహౌస్‌లోని ఆరు మోటార్లను ప్రారంభించి, నీటిని ఎత్తి పోస్తున్నారు. లక్ష్మీ బ్యారేజ్ ఇన్‌ఫ్లో 82వేల క్యూసెక్కులకు పైగానే ఉంది. దీంతో అధికారులు 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. కృష్ణా నది ఎగువన నీటి ప్రవాహాలు ఆశాజనకంగా ఉండడం, ఈ సారి వర్షాలు కూడా బాగానే పడే అవకాశం ఉంది.